అల్ఫారెట్టా, మార్చి 8, 2026: జార్జియాలోని నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వార్షిక నృత్యోత్సవం “నాట్యాంజలి – 2026” ఘనంగా నిర్వహించారు. “Dance for a Cause” థీమ్‌తో అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హై స్కూల్లో ఈ కార్యక్రమానికి 700 మందికిపైగా హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలియజేశారు.
ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగు రంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందించారు. నాలుగు సంవత్సరాల చిన్నారుల నుంచి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ యూఎస్ఏ సేవా సంస్థలకు అందజేయనున్నారు.

Natyanjali2
అకాడమీ నృత్య గురువు నీలిమ గడ్డమనుగు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శంకర నేత్రాలయ ప్రతినిధులు బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి; ఇండియన్ ఫ్రెండ్స్ ఆప్ అట్లాంటా అధ్యక్షులు గిరిధర్ కోటగిరి, గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఆంత్రప్రెన్యూర్స్ చైర్మన్ జ్యోత్స్న పాలకుర్తి, గేట్స్ అధ్యక్షులు రమణ గంద్ర, తెలుగు అసోసియేషన్‌ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు సునీత పొట్నూరు, ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాసన్, శ్రీరాం రొయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ, జనార్దన్ పన్నెల పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Natyanjali3
వారిలో హెచ్‌సీ రోబోటిక్స్ వెంకట్ చుండి, కోడ్హీరో అకాడమీకి చెందిన వెంకట్ ప్రణీతా కాకుల, రెడ్డి సీపీఏ, స్ప్లాష్ బీఐ కిరణ్ రెడ్డి పాశం, రాపిడ్ ఐటీ గౌతమ్ గోలి, ట్రూవ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ పరిమల, శ్రవణ్ మరిపెల్లి, కళ ది ఆర్ట్స్ కాత్యాయని పినిక, రాగం తాళం పల్లవి మ్యూజిక్ అకాడమనీ శ్రీవల్లి శ్రీధర్, ఫ్యామిలీ ఫస్ట్ ప్రైమరీ క్లినిక్ డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, శేఖర్స్ రియాల్టీ, వెంకట్ దుగ్గిరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలందించిన 3RDIఫొటో&వీడియో సంస్థకు ముఖ్యంగా రఘు వలుసానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Natyanjali4

Natyanjali5

Natyanjali6

Natyanjali7