Dil Raju | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను లాంచ్ చేయగా మంచి స్పందన వస్తోంది.
ఈ ఈవెంట్లో దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో సినీ జనాలు సినిమాలను ఏ స్థాయిలో ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న ప్రతీ నటీనటులు, టెక్నీషియన్లకు ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు.
అయితే ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మావోళ్లకు సినిమా కంటే.. మన దగ్గర సినిమాలు తక్కువ కాబట్టి మీ దగ్గర నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని మా డైరెక్టర్‌కు చెప్పా. ఆంధ్రాకు వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తరు. మన దగ్గర అయితే తెల్ల కల్లు, మటన్‌కు వైబ్ ఇస్తమని (నవ్వుతూ)’ అన్నారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
#ANDHRA People Gives a GREAT VIBE For FILMS but #TELANGANA People give Importance to MUTTON and Wine – #DilRaju 😳😳😳💥💥💥#SankranthikiVasthunam pic.twitter.com/PIfuJV3zN3
— GetsCinema (@GetsCinema) January 6, 2025
G2 | అడివిశేష్ జీ2 మిషన్‌లో జాయిన్ అయిన బేబిజాన్ నటి.. లొకేషన్ లుక్ వైరల్
Maharaja | చైనా బాక్సాఫీస్నూ వదలని విజయ్‌సేతుపతి.. మహారాజ అరుదైన రికార్డ్