Game Changer | గేమ్ ఛేంజర్ (Game Changer) టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు (High Court) నేడు విచారణ చేపట్టింది. ఈ మేరకు అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప 2తో కేసుతోపాటు విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది.
ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్ ధరలు పెంచబోం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటూ.. రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్ ధరల పెంపునకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 4 గంటల నుంచి..
10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్‌షోలు ప్రదర్శించేందుకు, ఆ రోజు 6 షోలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు 10న అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.100, 11-19 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.50 టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య