Trinadharao Nakkina | త్రినాథ రావు నక్కిన (Trinadharao Nakkina) డైరెక్షన్లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం మజాకా. రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రలో నటిస్తోంది. కాగా టీజర్ లాంచ్ ఈవెంట్లో త్రినాథరావు నక్కిన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో తీవ్రదుమారం రేపాయి.
ఈవెంట్లో త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ.. మన్మథుడు సినిమా తర్వాత అన్షు (Anshu) ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందంటూ.. ఆమె ఫారిన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని, కాదమ్మా తెలుగుకు సరిపోదు, కొంచెం అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా.. పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవడమే కాకుండా మహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది.
త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా సీక్వరించిన మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద.. త్వరలోనే నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రినాథరావు ఎక్స్ వేదికగా క్షమాపణలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశాడు.
అందరికీ నమస్కారం.. ముఖ్యంగా మహిళలకు, అన్షుకు.. నా మాటల వల్ల బాధపడ్డ ఆడవాళ్లందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నానన్నారు.
అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను 🙏🏽 pic.twitter.com/Xfui213GH2
— Trinadharao Nakkina (@TrinadharaoNak1) January 13, 2025
Director #TrinadhaRaoNakkina makes sexist remarks against #Anshu
“Is she looking the same? I think she has become a bit thin. I requested her to eat well as everything has to be in bigger size to meet the standards of Telugu cinema. She’s improving.”pic.twitter.com/ASVKA3Gq3N
— Cinemania (@CinemaniaIndia) January 12, 2025
Balakrishna | ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ స్టెప్పులు.. ముద్దులతో ముంచెత్తిన డాకు మహారాజ్.. Video
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు