Sankranthiki Vasthunnam Twitter Review | టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న సీనియర్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh) . క్లాస్, మాస్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ.. ఇలా జోనర్ ఏదైనా సరే తన మార్క్ యాక్టింగ్‌తో అదరగొట్టేయడం వెంకీ స్పెషాలిటి. ఇక కామిక్ టచ్ ఉన్న సినిమాలతో వినోదాన్ని అందించే దర్శకుల్లో ఒకడు అనిల్ రావిపూడి. ఇద్దరి కాంబోలో సినిమా వస్తే .. అదీ కూడా సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుంది.
గతంలో సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టిన ఈ క్రేజీ కాంబో ఈ సారి సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. మరి వెంకీ-అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎఫ్2, ఎఫ్3 హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? సినిమా గురించి నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో ఓ లుక్కేస్తే..
నెట్టింట టాక్, రివ్యూస్ ఇలా..
Done with my show. 2nd half is hilarious 🤣
That avakaya episode is too good
Althought it felt lengthy at parts, @AnilRavipudi handled last 30 minutes very well and ended with a message. Climax MONOLOGUE is a feast for Venkatesh Fans
My rating would be… pic.twitter.com/FmWLgmYrRo
— INNOCENT EVIL 😈 (@raju_innocentev) January 14, 2025
సెకండాఫ్ అద్భుతంగా ఉంది. ఆవకాయ ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది. కొన్ని భాగాలు సాగదీతగా అనిపిస్తాయి. అయితే అనిల్ రావిపూడి మాత్రం చివరి 30 నిమిషాలు చాలా చక్కగా హ్యాండిల్ చేయడమే కాకుండా.. మంచి సందేశంతో సినిమాను ముగించాడు. క్లైమాక్స్‌లో వచ్చే వెంకీ మోనోలాగ్ అభిమానులను విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ మూవీ సంక్రాంతికి కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్.
#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain.
Comedy works well in parts and irritates a bit in others.
Excl the logics and storyline,film manages to entertain with Venky#sankranthikivastunnam #VenkyMamaRating: 3/5 pic.twitter.com/Bj47bil4ca
— IndianCinemaLover (@Vishwa0911) January 14, 2025
కేవలం వినోదాన్ని అందించడమే టార్గెట్‌గా సాగే టైంపాస్ ఫెస్టివ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. చాలా సీన్లలో కామెడీ బాగా పండింది. అయితే కొన్ని ఇతర సన్నివేశాల్లో వచ్చే కామెడీ చిరాకు తెప్పించేలా సాగుతుంది. లాజిక్స్, స్టోరీలైన్స్ పక్కన పెడితే.. వెంకీ మార్క్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా సాగుతుంది.
#SankranthikiVasthunam Festive family entertainer 💥🙌🏾
Venky Performance and Buill Raju’s character with good music elevate the film.
Anil Ravipudi delivers a routine comedy formula.
A logic-free, timepass entertainer,decent festive watch for families.
pic.twitter.com/JjV9U2VyAW— Content Media (@Content__Media) January 13, 2025
ఫెస్టివ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకీ నటన, రాజు పాత్ర బాగుంది. మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేసేలా ఉంటుంది. లాజిక్కులు వెతక్కుండా.. కుటుంబసమేతంగా థియేటర్లలోకి వెళ్లి చూడదగ్గ టైంపాస్ ఎంటర్టైనర్.
Good 1st half
Situational comedy with a simple storylineVenky mannerisms & old movie references koncham ekkuva ayyav!
Godari gattu song visuals look cool &better than lyrical video.
Ee particular scene and aa buddodu expressions 👌😂
On to 2nd half pic.twitter.com/60hK411grC
— BhanuKanna (@Bhanuprasadh) January 13, 2025
ఫస్ట్ హాఫ్ బాగుంది. సింపుల్ స్టోరీలైన్‌తో సందర్భానికి అనుగుణంగా వచ్చే కామెడీ బాగుంది. వెంకీ మ్యానరిజమ్స్, పాత సినిమాల రెఫరెన్స్‌లు కొంచెం ఎక్కువయ్యాననిపిస్తుంది. గోదాది గట్టు పాట విజువల్ లుక్ చాలా కూల్‌గా.. లిరికల్ వీడియో కంటే ఉత్తమంగా అనిపిస్తుంది.
#SankranthikiVasthunam ⭐️⭐️1/2
#SankranthikiVasthunam is a lighthearted festive entertainer with decent comedy and good music, despite its weak storyline and uneven execution. Venky’s performance and the Bulli Raju character make it a satisfactory family watch.… pic.twitter.com/Fo0OB0uSa4
— Bharat Media (@bharatmediahub) January 14, 2025
కథాంశం వీక్‌గా ఉన్నప్పటికీ.. మంచి కామెడీ, సంగీతంతో సాగే సంక్రాంతికి మంచి వినోదం పంచే సినిమా. వెంకీ నటన, బుల్లి రాజు పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి.
Festive blockbuster #SankranthikiVasthunam
Went in with low expectations, but @AnilRavipudi delivered even more entertainment than expected 🙌 @VenkyMama ‘s dialogues during the final fight were amazing. Personally, I enjoyed the second half more than the first.… pic.twitter.com/QANqsVpBXt
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 13, 2025
తక్కువ అంచనాల మధ్య విడుదలైనా.. అనిల్ రావిపూడి అనుకున్న దాని కంటే ఎక్కువ వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే వెంకీ డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు.
#SankranthikiVasthunam
1st & 2nd half is a blockbuster fun ride! with a exiting pre interval While it has its flaws it’s a complete comedy entertainer
I’d rate the movie 3.75/5Blockbuster
New meaning for Hi 🤣🤣🤣🤣#VenkyMama #Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary pic.twitter.com/Kg9aBbwLuF
— Laxmi Tweets (@Laxmi_Tweets_9) January 13, 2025
ఫస్ట్, సెకండాఫ్ బ్లాక్‌బస్టర్ ఫన్ రైడ్. కొన్ని లోపాలు కనిపించినా.. ఎక్జయిటింగ్ ప్రీ ఇంటర్వెల్ ట్రాక్‌తో సాగే పక్కా కామెడీ ఎంటర్టైనర్.
#SankranthikiVasthunnamReview
Verdict: SOLID ENTERTAINER
Rating: ⭐⭐⭐🌟 #SankranthikiVasthunnam is a festive Ravipudi entertainer with a mix of comedy, action, and emotion. #Venkatesh shines, supported by a strong cast and vibrant visuals. While some humor feels stretched,… pic.twitter.com/9GHM3vRa7H— CineMarvel🇮🇳 (@cinemarvelindia) January 13, 2025
కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో సాగే అనిల్ రావిపూడి ఫెస్టివ్ ఎంటర్టైనర్. బలమైన తారాగణం, వైబ్రాంట్ విజువల్స్, కొంచెం సాగదీతగా అనిపించే హ్యూమర్ టచ్‌తో ఫన్, ఎంగేజింగ్‌గా సాగే వెంకీ మెరిశాడనే చెప్పాలి. ఫెస్టివ్ సీజన్‌కు కుటుంబసమేతంగా వెళ్లి చూడదగ్గ ఎంటర్టైనర్.
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Daaku Maharaaj | వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన ఫీట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?