Dhanush | కోలీవుడ్‌లో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సెలబ్రటీల జాబితాలో ముందు వరుసలో ఉంటారు వెట్రిమారన్ (Vetrimaaran), ధనుష్ (Dhanush). ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయని తెలిసిందే. వీరిద్దరి కలయికలో పొల్లాధవన్, ఆడుకాలం, వడా చెన్నై, అసురన్ సినిమాలొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరూ మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ స్టార్ సెలబ్రిటీలు ఐదో సినిమా చేయబోతున్నారు.
వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 సక్సెస్‌ఫుల్‌గా 25 రోజులుగా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా వడా చెన్నై సీక్వెలా లేదా కొత్త సినిమానా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ ఆసక్తికర ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.
వెట్రిమారన్, ధనుష్ కాంబోలో వచ్చిన ఆడుకాలం, అసురన్ సినిమాకు ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డులు కూడా అందుకున్నాడు. మరి ఐదోసారి రాబోతున్న సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ధనుష్, వెట్రిమారన్ తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వెట్రిమారన్ సూర్యతో వాడివాసల్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీకడై, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేర, హిందీలో తేరే ఇష్క్ మే ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు.
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు