Palle Prakruthi Vanam | ప్రతి గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పచ్చని మొక్కలు, చెట్లతో మినీ పార్కులను తలపించేలా గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పల్లె ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అయితే అలాంటి పల్లె ప్రకృతి వనంపై కాంగ్రెస్ సర్పంచ్ కన్ను పడ్డది.
ఇష్టారీతిన పల్లె ప్రకృతి వనం ధ్వంసానికి పాల్పడ్డది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలో వెలుగు చూసింది. జీనుగురాల గ్రామంలో గత ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనం నిర్మించగా.. అందులోని సుమారు 200 చెట్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ నాగమ్మ సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, పంచాయతీ సెక్రటరీ పరశురామ్‌తో కలిసి నరికివేసింది.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అత్యుత్సాహం ఎలా ఉందో తెలియజేసే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పల్లె ప్రకృతి వనం ధ్వంసం చేసిన సర్పంచ్
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలో, గత ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనం నిర్మించగా అందులోని 200 చెట్లను నరికివేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ నాగమ్మ సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, పంచాయతీ సెక్రటరీ పరశురామ్ pic.twitter.com/KFbIqEPi48
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026
Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!