Saudi Arabia | సౌదీలో 40 దేశాల కోళ్లు, గుడ్లపై నిషేధం.. జాబితాలో మన దేశం కూడా..
Saudi Arabia | అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్ (India) కూడా ఉంది.
Saudi Arabia : అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్ (India) కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వెల్లడించింది. దాదాపు 40 దేశాల నుంచి పౌల్ట్రీ, గుడ్లపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నది. ఈ జాబితాలో భారత్తో పాటు అఫ్గానిస్థాన్, చైనా, జర్మనీ, ఇండోనేసియా, యూకే, జపాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఉన్నాయి.
ఇవేగాక మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, భూటాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలపై ఈ పాక్షిక ఆంక్షలు అమలవుతాయని తెలిపింది. అయితే ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వేడి చేసిన పౌల్ట్రీ మాంసం, దాని సంబంధిత ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించబోదని సౌదీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

