Sankranthiki Vasthunnam Review | టాలీవుడ్లో క్లాస్, మాస్ ప్రేక్షకులతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా అభిమానించే హీరోల్లో ముందువరుసలో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh). సింపుల్ కథ, కథనాలకు కామిక్ టచ్‌ను జోడించి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో దిట్ట అనిల్ రావిపూడి. ఇక ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ ఇద్దరూ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సంక్రాంతికి వస్తున్నాంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది..సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచినట్టేనా తెలుసుకుందాం..
తారాగణం :
హీరోహీరోయిన్లు : వెంకటేశ్,
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్
నటీనటులు: శ్రీనివాస రెడ్డి, ఉపేంద్ర లిమాయే, రఘుబాబు, నరేశ్, వీటీవీ గణేశ్, మురళీధర్ గౌడ్, పోసాని కృష్ణ మురళి
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
బ్యానర్ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
రచన: అనిల్ రావిపూడి, ఎస్ కృష్ణ, జీ ఆది నారాయణ
దర్శకత్వం : అనిల్ రావిపూడి
కథ :
అంతర్జాతీయ స్థాయిలో టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్)భారత్ పర్యటనకు వస్తారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయనను ముఖ్యమంత్రి (నరేశ్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. పార్టీ ప్రెసిడెంట్ (వీటీవీ గణేశ్) స్పెషల్ పార్టీ అని సత్య ఆకెళ్లను తన ఫాంహౌస్‌ను తీసుకెళ్లడంతో కొందరు దుండగులు సత్య ఆకెళ్లను కిడ్నాప్ చేసి.. జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.
ఇక సత్య కిడ్నాప్ అంశం బయటకు వస్తే రాష్ట్ర పరువు పోతుందని భావించిన సీఎం మాజీ పోలీసాఫీసర్ ఐడీ రాజు (వెంకటేశ్)ని తేవాలనుకుంటాడు. అయితే నిజాయితీ గల ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వైడీ రాజు రాజమండ్రిలో తన భార్య (ఐశ్వర్యరాజేశ్) పిల్లలతో హాయిగా గడుపుతుంటాడు. దీంతో రాజును తీసుకొచ్చేందుకు సత్యకు సెక్యూరిటీ ఇచ్చిన అతని మాజీ ప్రేయసి (మీనాక్షి చౌదరి) వెళ్తుంది. ఇంతకీ రెస్య్కూ ఆపరేషన్ చేసేందుకు వైడీ రాజు ఒప్పుకున్నాడా..? మీనాక్షి, రాజు విడిపోయేందుకు కారణాలేంటి.. ప్రేయసి వచ్చాక రాజు భార్య ఎలా మారింది.. సత్య ఆకెళ్లను కిడ్నాప్ నుంచి రాజు కాపాడాడా..? అన్నదే కథ.
ఎలా ఉందంటే..?
ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంపైనే పూర్తిగా ఫోకస్ పెడుతుంది. అయితే కథ పెద్దగా సర్ప్రైజ్లు, ట్విస్టులు ఏం లేకుండా ఊహించేలా సరళంగా సాగుతుంది. కొన్ని పాత్రలకు సరైన స్క్రీన్ టైం లేకపోవడం, భారీ తారాగణాన్ని ఇంకా ఉపయోగించుకొని ఉంటే బాగుండేది.
సెకండాఫ్ అద్భుతంగా ఉంది. ఆవకాయ ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది. కొన్ని భాగాలు సాగదీతగా అనిపిస్తాయి. అయితే అనిల్ రావిపూడి మాత్రం చివరి 30 నిమిషాలు చాలా చక్కగా హ్యాండిల్ చేయడమే కాకుండా.. మంచి సందేశంతో సినిమాను ముగించాడు. క్లైమాక్స్‌లో వచ్చే వెంకీ మోనోలాగ్ అభిమానులను విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
టెక్నికల్‌గా..
దర్శకుడు అనిల్ రావిపూడి సరదాగా సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ. కథనంలో భాగమవుతూ సాగే పాటలు ఇప్పటికే హిట్‌గా నిలిచాయి. కథ సారాంశాన్ని ఒడిసిపట్టేలా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 3/5
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Daaku Maharaaj | వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన ఫీట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?