Sankranthiki Vasthunam | అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) హీరోగా.. ఐశ్వర్యారాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ వసూళ్లకు సంబంధించి క్రేజీ వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
గ్రాండ్‌గా ఓపెనింగ్ వసూళ్లతో మొదలైన ఈ చిత్రం రెండు, మూడో రోజు కూడా అదే మేనియాను కొనసాగించింది. సంక్రాంతికి వస్తున్నాం గుంటూరు, సీడెడ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ పూర్తి చేసుకుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ వీకెండ్‌కు ఇతర ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను బీట్ చేయనున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఈ చిత్రం కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో నరేశ్, పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎంగేంజింగ్గా సాగే ఇంటర్య్వూలు, చార్ట్ బస్టర్ పాటలు, ఇంప్రెసివ్ ప్రోమోలు.. ఇలా ప్రతీ విషయం సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Sankranthiki Vasthunnam Review | వెంకటేశ్ బ్లాక్ బస్టర్ కొట్టాడా..? సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Raja Saab | ప్రభాస్ రాజాసాబ్‌కు మాస్ ఆల్బమ్.. పాటలు ఎలా ఉంటాయో చెప్పిన థమన్