వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై శనివారం అకస్మికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వివరాలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. ఇరాన్లో దాడి కోసం అమెరికా మూడు బీ-1 హెవీ బాంబర్లను వినియోగించినట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రి అమెరికా నుంచి ఆ బాంబర్లు బయలుదేరాయి. దీనిపై డిఫెన్స్ నిపుణులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. బీ-1బీ లాన్సర్ బాంబర్లకు చెందిన ట్రాకింగ్ వివరాలను కూడా నిపుణులు వెల్లడించారు.
మిలిటరీ ఎయిర్ ట్రాకింగ్ అలియన్స్ కు చెందిన ఫౌండర్ బీ-1బీ బాంబర్ల సమాచారాన్ని రిలీజ్ చేశారు. 30 మంది సభ్యులతో కూడిన డిఫెన్స్ బృందం.. అమెరికా బీ-1 బాంబర్ల ట్రాకింగ్ డేటాను విశ్లేషించారు. అమెరికా నుంచి నాన్‌స్టాప్‌గా మూడు బీ-1 బాంబర్లు ఇరాన్ బయలుదేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇరాన్లో ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను ఆ బాంబర్లు ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు.
#OperationEpicFury #FreeIran
“OPERATION EPIC FURY” BOMBER MISSION #2
I can confirm that 3x B-1B “Lancer” bombers from Ellsworth AFB have conducted strikes against Iran regime targets overnight after a non-stop flight from the United States. This is the second bombing mission we… pic.twitter.com/kMZfroiiIu— DefenceGeek 🇬🇧 (@DefenceGeek) March 2, 2026
600 సైట్లు.. 2500 బాంబులు : ఐడీఎఫ్
ఇరాన్లో జరుగుతున్న ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ రక్షణ దళం కూడా ప్రకటన చేసింది. వైమానిక దాడుల ద్వారా ఇరాన్లో ఉన్న సుమారు 600 ప్రదేశాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ సెక్యూర్టీ నేతలకు చెందిన 20 సైట్లు దీనిలో ఉన్నట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 150 బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, 200 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను వాడినట్లు మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయిల్ వైమానిక దళం సుమారు 2500 బాంబులు జారవిడిచినట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఇరాన్‌లోని ఓ ఎయిర్ బేస్‌లో ఇరానీ సైనికుల్ని టార్గెట్ చేస్తూ నిర్వహించిన దాడులకు చెందిన ఓ వీడియో ఫూటేజ్‌ను ఐడీఎఫ్ రిలీజ్ చేసింది. ఇజ్రాయిలీ విమానాల వైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఆపరేట్ చేస్తున్న ఇరానీ సైనికుల్ని చంపినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొన్నది.
כלי טיס של חיל-האוויר תקפו וסיכלו חוליית חיילים ממערך ההגנה של משטר הטרור האיראני בזמן שניסו להפעיל מערכות הגנה נגד כוחותינו.
צה”ל לא יאפשר למשטר הטרור האיראני להפעיל מערכות הגנה על מנת לפגוע במטוסי חיל האוויר וימשיך לתקוף ניסיונות לחמש את משגרי הטילים.
במקביל חיל-האוויר ממשיך… pic.twitter.com/WGX8VuwIC4
— Israeli Air Force (@IAFsite) March 2, 2026