Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..! దుర్గ్‌లో అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్..!
Saif Ali Khan | బాలీవుడ్ నటుడు (Bollywood Actor) సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan )పై దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు (RPF Police) అరెస్టు చేశారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ (Shalimar Gyaneshwari Express) జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా దుర్గ్ ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకుంది. ముంబయి పోలీసులు పంపిన ఫొటో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు చేరుకోనున్నారు.
Saif Ali Khan | బాలీవుడ్ ప్రముఖ నటుడు (Bollywood Actor) సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan ) పై కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు (RPF Police) అరెస్టు చేశారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ (Shalimar Gyaneshwari Express) జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా దుర్గ్ ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకున్నది. ముంబయి పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులకు పంపారు. ఈ క్రమంలోనే ఆర్పీఎఫ్ పోలీసులు సదరు వ్యక్తిని ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకొని వీడియోకాల్ ద్వారా నిందితుడి గుర్తింపు ధ్రువీకరించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడి ముంబయి నుంచి బిలాస్‌పూర్‌కు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాడు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు దుర్గ్ ఆర్పీఎఫ్ ఓ ఫొటో పంపారని.. దాని ఆధారంగా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఓ అనుమానాస్పద యువకుడిని అదుపులోకి తీసుకున్నామని ఆర్పీఎఫ్ ఇన్చార్జి సంజీవ్ సిన్హా తెలిపారు. ఆ యువకుడి పేరు ఆకాశ్ కైలాష్ కనౌజియా అని, అతని స్వస్థలం ముంబయి అని తెలిపారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో బిలాస్పూర్ వెళ్తున్నాడని.. టిల్డా నెవ్రాలో తెలిసినవారి ఇంటికి వెళ్తున్నానని ఆర్పీఎఫ్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు రాత్రి 8 గంటల వరకు రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి దుర్గ్‌కు వస్తారని ఆయన వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

