Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Bigg Boss Kannada | బుల్లితెర రియాలిటీ షో కన్నడ బిగ్ బాస్‌కి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.
Bigg Boss Kannada | హలీవుడ్ షో బిగ్ బ్రదర్(Bigg Brother)కి మాతృకగా వచ్చిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కి ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీలోనే కాకుండా తమిళం, కన్నడలోను ఈ షో టాప్ రియాలిటీ షోలలో ఒకటిగా నిలిచింది. అయితే కన్నడ బిగ్ బాస్ షోకి సంబంధించి హోస్ట్‌గా చేస్తున్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ షోకి తాను ఇకపై హోస్ట్‌గా చేయనని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
కన్నడలో బిగ్‌బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి హోస్ట్‌గా కిచ్చా సుదీప్ ఉన్నాడు. 2013లో ఈ షో స్టార్ట్ అవ్వగా.. ఇప్పటివరకు 11 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇందులో 11 సీజన్లకు సుదీప్ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ స్టార్ నటుడు తాజాగా కన్నడ బిగ్ బాస్‌కి దూరమవుతున్నట్లు ప్రకటించాడు.
”గత 11 సీజన్ల నుంచి నేను ఇష్టంతో పాటు ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. ఈ షోకి హోస్ట్‌గా చేసిన నాపై మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. త్వరలో జరుగనున్న ఫినాలేతో బిగ్ బాస్‌తో నా ప్రయాణం ముగుస్తుంది. వ్యాఖ్యతగా నా శక్తి మేరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని ఆశిస్తున్నాను. ఇది మరపురాని ప్రయాణం, నాకు సాధ్యమైనంతవరకూ ఉన్నతంగా దీనిని కొనసాగించా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కలర్స్ కన్నడ టీవీకి వారికి ధన్యవాదాలు. ప్రేమతో మీ కే” అంటూ రాసుకోచ్చాడు సుదీప్.
BB is smthn I have enjoyed from past 11 seasons. Thank u all for all the love you have shown. Coming finale is my last as a host, and I hope to entertain u all to my best.
It’s an unforgettable journey, I’m glad to have handled it to my best.
Thank you, @ColorsKannada, for this…— Kichcha Sudeepa (@KicchaSudeep) January 19, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

