Saudi Crown Prince | ఇరాన్‌పై దాడి చేయాలని ట్రంప్‌కు పదేపదే ఫోన్ చేసిన సౌదీ యువరాజు..!
Saudi Crown Prince | ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమైన ఇరాన్ (Iran) పై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Saudi Crown Prince : ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమైన ఇరాన్ (Iran) పై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బయటికి ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతూనే.. గత నెలలో ట్రంప్‌కు పదేపదే ప్రైవేట్ ఫోన్ కాల్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది.
ఇరాన్‌పై దాడులు చేయాలని సౌదీ యువరాజు మళ్లీమళ్లీ ట్రంప్‌ను ఫోన్లో కోరినట్టు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొన్నది. ఈ ఏడాది జనవరిలో ఇదే సౌదీ యువరాజు.. ఇరాన్‌పై దాడికి మా గగనతలాన్నిగానీ, భూతలాన్నిగానీ అనుమతించబోమని చెప్పారు. ఇరాన్ సౌర్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ దేశాలు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
కాగా రెండు రోజుల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని, అతని కుటుంబసభ్యులు పలువురిని హతమార్చాయి. ఇరాన్ రక్షణ మంత్రిని, ఆర్మీ చీఫ్‌ను కూడా చంపేశాయి. ప్రతీకారంగా అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తుంటే ఆయా దేశాలు తప్పుపడుతున్నాయి. పైగా ఒంటరి అయిపోతావ్ అంటూ ఇరాన్‌నే హెచ్చరిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

