Peddi | రాంచరణ్ (Ram Charan)కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ పెద్ది (Peddi).ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ ఇండియాతోపాటు వరల్డ్‌వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. కాగా మేకర్స్ ఇక సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’సాంగ్‌ను రేపు లాంచ్ చేయనుండగా అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే రాంచరణ్ ఊహించని సర్ప్రైజ్ ఒకటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ సారి సాంగ్ గురించి కాకుండా సినిమాకు డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని షేర్ చేశాడు. స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న వీడియో క్లిప్ ఒకటి షేర్ చేయగా.. డైరెక్టర్ బుచ్చిబాబు రాంచరణ్‌కు డైలాగ్స్ వివరిస్తుండటం చూడొచ్చు. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పెద్ది ఏప్రిల్ 30న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
BMW | ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. జీ5లో స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అంటే..!
Roja | రాజకీయాలకి షార్ట్ బ్రేక్.. తిరిగి సినిమాలతో బిజీ అవుతున్న రోజా