Vijay Devarakonda | పెళ్లి తర్వాత తొలిసారిగా బయట కనిపించిన విజయ్ – రష్మిక.. జూబ్లీహిల్స్ వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
Jubilee Hills Venkateswara Swamy Temple | ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌లో దర్శనమిచ్చారు.
Jubilee Hills Venkateswara Swamy Temple | ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌లో దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ఈ కొత్త జంట జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి (టీటీడీ) ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ నూతన జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటూ స్వామివారిని దర్శించుకున్న ఈ వేడుకలో విజయ్ దేవరకొండ సంప్రదాయబద్ధమైన కుర్తాలో కనిపించగా, రష్మిక పట్టుచీరలో మెరిసిపోయారు. వీరితో పాటు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఈ జంటకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమ వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులకు మిఠాయిలు పంచుతామని గతంలోనే ప్రకటించిన ఈ జంట, దర్శనం ముగిసిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని భక్తులకు, అభిమానులకు స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. విజయ్-రష్మికలు ఆలయానికి వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోగా, “విరోష్” జంట చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ సందడి చేశారు. కాగా, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
#virosh distribute sweets ❤️#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/XxLZXWjpAp
— Thedeverakonda (@VijayDe78593148) March 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

