Jaat Movie | టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వస్తున్న చిత్రం జాట్ (Jaat). బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol) హీరోగా నటిస్తున్నాడు. ఎస్డీజీఎం (SDGM) ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రెజీనా కసాండ్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ సినిమాలో హైఆక్టేన్ యాక్షన్ స్టంట్స్ థ్రిల్ అందించబోతున్నాయట. అంతేకాదు తాజా టాక్ ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. అనల్ అరసు, రామ్-లక్ష్మణ్, నాగవెంకట్, పీటర్ హెయిన్స్ టీం జాట్ కోసం ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీన్లను రెడీ చేస్తుందని ఇన్సైడ్ టాక్. గోపీచంద్ మలినేని నుంచి ఎలాంటి యాక్షన్ మూవీ వస్తుందో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్.గోపీచంద్ మలినేని బీటౌన్ జాట్ సినిమాతో డెబ్యూ ఇస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో