Sankranthiki Vasthunam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్యారాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించిన విషయం తెలిసిందే.
తాజాగా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయి.. వెంకీ కెరీర్ బెస్ట్ కలెక్షన్లుగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు అనిల్ రావిపూడి, వెంకటేశ్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హ్యాట్రిక్ కాంబోలో విడుదలై.. నార్త్ అమెరికా-2.3 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లకుపైగా) రాబట్టి.. యూఎస్ఏలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.
మొత్తానికి ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనేకాదు ఓవర్సీస్లో కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేసి వెంకీ టీంకు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతినిచ్చారు . ఈ చిత్రంలో నరేశ్, పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
Yeah @VenkyMama #VictoryVenkatesh Smashed His All Time Career Best 🔥🔥 #SankranthikiVastunnam World Wide 200 Crore Gross + Counting . pic.twitter.com/knRVDKwZO0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 20, 2025
#SankranthikiVasthunam is rewriting history at the USA box office with every passing day! 🚀🔥
With a staggering $2.3M+ Gross in North America, it has now become the ‘All-Time Highest Grosser’ for the unbeatable combo of Victory @venkymama, @anilravipudi, and @SVC_official! 💥💥… pic.twitter.com/DYBhiHC4jZ
— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో