VD12 | ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంపౌండ్ నుంచి వరుస సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న వీడీ12 (VD12). మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు రాగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా టీజర్ ఎప్పుడనే వార్త బయటకు వచ్చింది.
ఈ మూవీ టీజర్ రెడీ అయింది. ఫిబ్రవరి 7న టీజర్ విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు. టీజర్లో విడుదల తేదీ చెప్పబోతున్నారంటూ.. మే 30 డేట్ను మరోసారి గుర్తు చేసింది పీఆర్ టీం. ఇంకేంటి మరి త్వరలోనే వీడీ12 టీజర్ రాబోతుందన్నమాట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
వీడీ 12లో విజయ్ దేవరకొండ తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టుతోపాటు రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వంలో VD14 సినిమా కూడా చేస్తున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది.
Exclusive : #VD12 టీజర్ రెడీ అయ్యింది…
ఫిబ్రవరి 7న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
టీజర్ లో రిలీజ్ డేట్ చెప్పబోతున్నారు.
May 30th 💥
— Rajesh Manne (@rajeshmanne1) January 21, 2025
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్