Sukumar | హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసాలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. తాజాగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంటితోపాటు ఆఫీసులో కూడా తనిఖీలు చేపట్టారు.
పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్, ఆదాయ వనరులు తదితర డాక్యుమెంట్లను పరిశీలించారు. పుష్ప 2కు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్.. ఇందుకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు ఇప్పటికే మంగళవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
పెట్టుబడులు, ఆదాయాలపై ఆరా..
ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరాతీసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు పెట్టుబడులు.. వచ్చిన ఆదాయం ఇతర విషయాలపై దిల్ రాజును ప్రశ్నించగా.. తాను విజయ్‌తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.
అంతేకాదు విజయ్‌కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్