Dil Raju | ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసాలు, వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
రెండో రోజూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమాలకు పెట్టుబడలు.. వచ్చిన ఆదాయం ఇతర విషయాలపై దిల్ రాజును ప్రశ్నించగా.. తాను విజయ్‌తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు విజయ్‌కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్.
బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం..
సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు.
దిల్ రాజు నివాసాలతోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లో ఇప్పటికే ఐటీ సోదాలు చేపట్టారని తెలిసిందే.
#ITRaids at Multiple Properties linked to #TFDC Chairman and Prominent Film Producer #DilRaju, #MythriMovieMakers the #Pushpa2 makers, Mango Mass Media.. in #Hyderabad.
The officials of the Income Tax Department conducted extensive raids on the properties of prominent filmmaker… pic.twitter.com/86qUoK6y8I
— Surya Reddy (@jsuryareddy) January 21, 2025
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్