Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?
Venkatesh | ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh). ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్క్ దాటిపోయింది.
Venkatesh | ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh). ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్క్ దాటిపోయింది.
కాగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా గడిపిన వెంకటేశ్ బ్రేక్ తీసుకున్నాడన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. వెంకీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ నుంచి విరామం తీసుకున్నాడని.. ప్రస్తుతం స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కూర్గ్ (కొడగు)లో ఉన్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కూర్గ్‌లోని చల్లని వాతావరణాన్ని, అందమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను ఎంజాయ్ చేస్తున్నాడట వెంకీ.
త్వరలో కూర్గ్ వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి రానున్న వెంకీ.. ఆ తర్వాత తన నెక్ట్స్ వెంచర్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఇక ప్రస్తుతానికైతే అన్నీ మరిచిపోయి హాయిగా పచ్చనైన కొండ ప్రాంతాలను, కాఫీ తోటల్లో సేద తీరుతున్నాడట. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు తన కొత్త ప్రాజెక్ట్ కోసం రిఫ్రెష్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వెంకీ.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా చేయబోతున్నాడని తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్లో మరోవైపు సైంధవ్ 2 కూడా చేయాల్సి ఉండగా.. క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also :
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

