Saif Ali Khan | భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా భోపాల్‌లో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులు కేంద్ర ప్రభుత్వం హస్తగతం కానున్నాయి. ఈ ఆస్తులపై ఉన్న స్టే ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడంతో 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఈ చట్టం కింద 1947లో దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారి ఆస్తులను కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకోగలదు. 1947లో భోపాల్ నవాబుల పాలనలో ఉంది. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ తాత(తల్లి తరఫు) నవాబ్ హమీదుల్లా ఖాన్ చివరి నవాబుగా ఉన్నారు.