హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు ( Massive surrender) . లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు దేవ్జీ ( Devji ) , బడే చొక్కారావు( Bade Chokka Rao ) గన్మెన్లు ఉన్నారు.

శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూంలో డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యాన సీఎం సమక్షంలో లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం 130 మంది 124 తుపాకులతో లొంగిపోవడం విశేషం. వీటిలో 31 ఏకే 47 తుపాకులున్నాయి. ఈ సందర్భంగా నక్సల్స్ అప్పగించిన తుపాకులను సీఎం పరిశీలించారు. లొంగిపోయిన వారిలో 125 మంది చత్తీస్గఢ్, 4గురు తెలంగాణకు చెందిన అజ్ఞాతంలో ఉన్నవారు , ఒకరు ఏపీకి చెందిన వారని డీజీపీ వెల్లడించారు.