హైదరాబాద్ : బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేట్(Nizampet) ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్(Gas cylinder explodes) వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిజాంపేట్లో భారీ అగ్ని ప్రమాదం.. టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్
హైదరాబాద్ – నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా చెలరేగిన మంటలు
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు
సంఘటన స్థలానికి… pic.twitter.com/Ea8PqXOdDa
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025