Crusher | మునిపల్లి, మార్చి 7 : 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయారా మంత్రి గారు… లేక మార్చినట్టు వ్యవహరిస్తున్నారా.. ? గుర్తున్నా మనకెందుకులే ఆని అనుకుంటున్నారా..? అని మునిపల్లి మండల వాసులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సిహఫై మునిపల్లి మండల వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మునిపల్లి మండలం కళ్లపల్లి -బెలూరు గ్రామ శివారులోని ఓ క్రషర్ మిషన్ తో స్థానిక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.
ఈ విషయమై స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. నాడు ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోకి వచ్చి కళ్లపల్లి -బెలూరు, చిలపల్లి గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను విని.. నేను గెలిస్తే కచ్చితంగా మీ గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేస్తా అని అన్నారు. నాడు ఇచ్చిన హామీని నేడు మర్చిపోయినట్టు వ్యహరిస్తున్నట్టు స్థానికులు మంత్రి దామోదర రాజానర్సింహా తీరుపై అసహనం వ్యక్తం చెస్తున్నారు.
బుధవారం రాత్రి ఏం జరిగింది.. ?
మునిపల్లి మండలం కళ్లపల్లి -బెలూరు గ్రామంలో బుధవారం అర్థ రాత్రి ఏం జరిగింది..? రాత్రి కళ్లపల్లి -బెలూరు గ్రామస్థులు ఇండ్లలో నుంచి బయటకు ఎందుకు వచ్చారు.. కళ్లపల్లి-బెలూరు గ్రామ శివారులోని క్రషర్ వద్ద పేలుళ్లు చేపట్టడంతో అర్థరాత్రి స్థానికులు ఒక్కసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పరుగులు పేట్టారు.. ఇండ్లలోకి పెద్ద పెద్దగా సౌండ్ రావడంతో భయాందోళనతో జనాలు పరుగులు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…
నాడు ఒక్కటే… నేడు రెండు
మునిపల్లి మండలంలోని కళ్లపల్లి-బెలూరు గ్రామ శివారులో నాడు దామోదర రాజానర్సింహా క్రషర్ కంపెనీ మూసివేస్తా అని హామీ ఇచ్చినప్పుడు ఒక్కటే క్రషర్ ఉండే…. నేను దామోదర్ మంత్రి అయ్యాక మరొక క్రషర్ ఏర్పాటు చేశారు… దీన్ని బట్టే మంత్రి దామోదర రాజానర్సింహాకు మునిపల్లి మండల ప్రజలపై ఎంతటి ప్రేమ ఉందోనని అర్థం అవుతుంది. మంత్రి దామోదర రాజానర్సింహాకు తెల్వకుండానే కళ్లపల్లి -బెలూరు గ్రామ శివారులో మరో క్రషర్ వచ్చిందా అని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చెస్తున్నారు.
2024లో అప్పటి మునిపల్లి మండల అధికారులు కళ్లపల్లి -బెలూరు శివారులోని క్రషర్ పనులు నిలిపివేయాలని నోటీసులు ఇలా ఇచ్చి.. అలా చేతులు దులుపుకున్నారు.. అధికారులు ఇచ్చిన నోటీసులను చెత్త బుట్టలో పడేసి.. మమ్మల్ని ఎవ్వరు ఏం చేస్తరులే అన్నట్టు క్రషర్ నడిపిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా కొనసాగుతున్న క్రషర్లపై చర్యలు తీసుకొని స్థానిక ప్రజలను కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.


