Crime news : ఆమె తనకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్‌తో బయటికి వెళ్లింది. రాత్రంతా అతడితో తిరిగింది. అక్కడ ఆమెపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఉదయం ఇంటికి వెళ్తే రాత్రంతా ఎక్కడికి వెళ్లావని ఇంట్లో వాళ్లు కొడతారనే భయంతో వింత నాటకం ఆడింది. రహస్య భాగం (Private part) లో సర్జికల్ బ్లేడ్ (Surgical blade) పెట్టుకుని.. రక్త స్రావం కాగానే తనపై రేప్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు ట్విస్ట్ బయటపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని నలసోపారా టౌన్షిప్లో ఓ 20 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె తనకు పరిచయస్తుడైన ఆటో డ్రైవర్‌తో బయటకు వెళ్లింది. వారిద్దరూ ఆ రాత్రంతా హోటల్లో గడపాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ సదరు మహిళ దగ్గర ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోవడంతో హోటల్ రూమ్ దొరకలేదు. దాంతో తమ ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలోని ఆర్నాలా బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఆటో డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఆమెను ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు.
అయితే రాత్రంతా ఎక్కడికి వెళ్లావని ఇంట్లో వాళ్లు కొడతారనే భయంతో ఆమె ఇంటికి వెళ్లకుండా బయట ఓ సర్జికల్ బ్లేడ్ కొనుగోలు చేసింది. అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌కు వెళ్లి, సర్జికల్ బ్లేడ్‌ను ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి రహస్య భాగంలో పెట్టుకుంది. ఆపై రాళ్లు చొప్పించుకుంది. రక్తస్రావం కాగానే పోలీసులకు ఫోన్ చేసింది. తనపై అత్యాచారం జరిగిందని, దుండగుడు సర్జిబ్లేడ్, రాళ్లు చొప్పించాడని ఫిర్యాదు చేసింది.
దాంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై ఎంక్వయిరీ చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆమె ఆటో డ్రైవర్‌తో తిరిగి ఇంట్లో వాళ్లు కొడతారనే భయంతో రేప్ నాటకం ఆడిందని వెల్లడైంది. దాంతో పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేశారు.
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?