Rohit Sharma’s Wicket : భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ అగ్ర శ్రేణి క్రీడాకారుడు. పదునైన బంతులను సైతం అవలీలగా బౌండరీ బయటికి తరలించడంలో దిట్ట. అతడు క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు దడే. పరుగుల వరద పారాల్సిందే. ఫీల్డర్లు మైదానం అంతా పరుగులు పెట్టాల్సిందే. సాధారణంగా ఓ బ్యాటర్ వికెట్ తీస్తే బౌలర్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఏకంగా రోహిత్ శర్మ లాంటి ఓ విధ్వంసకర బ్యాటర్ వికెట్ తీస్తే ఇంకెలా ఉండాలి..? ఆ బౌలర్ ఎగిరి గంతులు వేయాలి.
కానీ జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కు చెందిన బౌలర్ (Bowler) ఉమర్ నజీర్ మిర్ (Umar Nasir Mir) మాత్రం హిట్ మ్యాన్ వికెట్ దక్కినా ఎలాంటి సంబురాలు చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందుకు సంబురాలు చేసుకోలేదో వెల్లడించాడు. రోహిత్ శర్మకు తాను వీరాభిమానినని, ఆయన వికెట్ తీస్తే తాను సంబురాలు ఎలా చేసుకోగలనని ప్రశ్నించాడు. ప్రత్యర్థి జట్టులో రోహిత్ శర్మ ఉన్నందున ఈ మ్యాచ్‌లో తాము ముంబైపై గెలిస్తే మాత్రం తాను గర్వపడుతానని చెప్పాడు.
కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. టీమిండియా అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ కోల్పోకుండా ఉండేందుకు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కొత్త రూల్ ప్రకారం.. రోహిత్ శర్మ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా రంజీ మ్యాచ్ ఆడాడు. ముంబై తరఫున జమ్ముకశ్మీర్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపర్చాడు.
31 ఏళ్ల ఉమర్ నజీర్ మిర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ ఔటయ్యాడు. అతనితోపాటు రహానే (12), శివమ్ దూబే (0), హార్దిక్ తమోర్ (7) వికెట్లను కూడా ఉమర్ నజీర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంచలన ప్రదర్శనతో అతను టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత నజీర్ సంబరాలు చేసుకోకపోవడంపై చర్చ క్రికెట్ వర్గాల్లో చర్చ జరిగింది. దాంతో అందుకుగల కారణాన్ని ఉమర్ నజీర్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Novak Djokovic: గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ నుంచి తప్పుకున్న జోకోవిచ్..
Rohit Sharma: రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశే .. 28 రన్స్‌కే రోహిత్ శర్మ ఔట్