Balka Suman | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
Balka Suman | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం కలిశారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) ను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman) శుక్రవారం కలిశారు. ఇటీవల క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన బాల్క సుమన్ తొలిసారి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎన్నికల్లో ఎంతో దైర్యంగా , సమర్ధవంతంగా పనిచేసి మెజారిటీ సభ్యులను గెలిపించు కున్నందుకు, కాంగ్రెస్ దౌర్జన్యాలను తిప్పికొట్టినందుకు బాల్కసుమన్‌ను అభినందించారు.
మున్సిపల్ ఎన్నికలు జరిగి నెలరోజులు కావస్తున్నా క్యాతన్‌పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నికకు కాంగ్రెస్ అడ్డం పడుతుంది. మెజారిటీ లేకున్నా బలప్రయోగం, బెదిరింపులతో హస్తగతం చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుంది.
ఇందులో భాగంగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ , సీపీఐ అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. ఇక సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే అన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, మంత్రి వివేక్ ,ఎంపీ పోలీసుల సహకారంతో అడ్డుపడుతూ వచ్చారు.
చివరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలులు పెట్టారు.సుమారు 16 రోజుల పాటు బెయిల్ దొరకకుండా అడ్డుపడ్డారు. రెండు రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన బాల్కసుమన్ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైకోర్టు ఆదేశాలు ..
జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు ( Kyatanapalli municipal elections ) మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ( High Court ) ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

