– కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు
కోదాడ, మార్చి 06 : భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పొందేందుకు తెలంగాణ ఆర్టీసీ చేపడుతున్న కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కోదాడలోని బస్ డిపోలో సీతారాముల కల్యాణ తలంబ్రాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 27న శ్రీరామ నవమి అనంతరం స్వామివారి కల్యాణ తలంబ్రాలను బుకింగ్ చేసుకున్న వారికి ఆర్టీసీ సిబ్బంది ఇంటికి వచ్చి తలంబ్రాల ప్యాకెట్లు అందిస్తుందన్నారు. ఇందుకోసం రూ.151 తో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకోవాల్సిన వారు 96669 31799, 91542 98693 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నాగేశ్వరరావుతో పాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.