రుద్రంపూర్, ఆగస్టు 05 : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని రుద్రంపూర్ ప్రాంతంలోని నాలా ఏరియాలో అమ్మవారి దేవాలయాల్లో బుధవారం బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు తలపై బోనాలను ఎత్తుకుని డప్పు వాయిద్యాలు, నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.