తాండూర్ : క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే జైల్ భరో ( Jail Bharo) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ ( CITU ) జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం పిలుపునిచ్చారు. తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం సదస్సు నిర్వహించి కరపత్రాలను విడుదల చేశారు.
అనంతరం ఎమార్సీ కార్యాలయంలో సీసీవో ప్రశాంత్ కుమార్కు జైల్భరోలో పాల్గొంటామని మధ్యాహ్న భోజన కార్మికులు వినతిపత్రం అందించారు. దాగం రాజారాం మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే జైల్ భరోలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, యువకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం తాండూరు మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, నాయకులు బొల్లం రాజేశం, దుర్గం శంకర్, కోళ విజయలక్ష్మి, మహంకాళి విజయలక్ష్మి, సరిత, అరవింద, రెడ్డి మల్లక్క, హనుమక్క, వరలక్ష్మి, జైనేని లక్ష్మి, దుర్గం లక్ష్మి, పాల్గొన్నారు.