Mark Zuckerberg | క్షమాపణలు చెప్పిన మెటా సీఈవో జుకర్‌బర్గ్.. డీప్‌ఫేక్, చైల్డ్ పోర్న్, నిర్వహణా లోపాలపై క్షమాపణ
Mark Zuckerberg : మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. తన ప్లాట్‌ఫాంలపై చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం), డీప్‌ఫేక్ కంటెంట్, నిర్వహణ లోపాలు అన్నింటికీ కలిపి జుకర్‌బర్గ్ బుధవారం కేంద్రానికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
Mark Zuckerberg : మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. తన ప్లాట్‌ఫాంలపై చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం), డీప్‌ఫేక్ కంటెంట్, నిర్వహణ లోపాలు అన్నింటికీ కలిపి జుకర్‌బర్గ్ బుధవారం కేంద్రానికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. మెటా ప్లాట్‌ఫాంలలో లోపాలపై ఆ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రధాని వీడియో తొలగింపుపై కూడా కేంద్రం మెటాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోగా మెటా సీఈవో జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పాలని కేంద్రం డిమాండ్ చేసింది. జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టబద్ధమైన రక్షణ కల్పించే క్లాజ్ (సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్) కోల్పోతారని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో బుధవారం మెటా ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మెటా తరఫున సంస్థ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కాప్లన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధాని వీడియో తొలగింపుపై మెటా ప్రతినిధులు వివరణ ఇచ్చారు.
అభ్యంతరకర కంటెంట్‌ను ఎలా అనుమతించారంటూ కేంద్రం ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరింది. 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. సంస్థ తరఫున జరిగిన పొరపాట్లను ఆయన అంగీకరించారు. నిర్వహణా లోపాలపై విచారం వ్యక్తం చేసిన జుకర్‌బర్గ్.. మోదీతోపాటు, అన్నింటికీ క్షమాపణలు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

