Saif Ali Khan case : బాలీవుడ్ నటుడు (Bollywood actor) సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పై కత్తితో దాడి చేసిన కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ (Bangaldesh) నిందితుడు మహ్మద్ షరీఫ్ ఉల్ ఇస్లామ్ సెహజాద్ (Mohammad Shariful Islam Shehzad) తండ్రి మహ్మద్ రాహుల్ అమీన్ (Mohammed Ruhul Amin) భారత్‌కు చెందిన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన కొడుకు అమాయకుడని, వాడిని అక్రమంగా కేసులో ఇరికించారని అన్నాడు.
తాను, తన ఇద్దరు కొడుకులు మా దేశంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) క్రీయాశీలక సభ్యులమని రాహుల్ అమీన్ చెప్పాడు. ఈ క్రమంలో షేక్ హసీనా సర్కారు తమపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని తెలిపాడు. హసీనా 16 ఏళ్ల పాలనలో ప్రభుత్వం తన కొడుకుపై అనేక కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందని అన్నాడు. బంగ్లాదేశ్‌లో సెహజాద్‌కు బతికే పరిస్థితి లేకుండా చేసిందని, అందుకే భారత్‌కు పారిపోయాడని తెలిపాడు.
అంటే మీ కుమారుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి భారత్‌కు పారిపోయి వచ్చాడా..? మీడియా సంస్థ ప్రశ్నించగా.. కాదని అన్నాడు. కేసుల నుంచి తప్పంచుకోవడానికి కాదని, ఇక్కడ బతికే పరిస్థితి లేక అక్కడ బతుకుదెరువు కోసం వచ్చాడని చెప్పాడు. ఆతిథ్య రంగంలో ఆయన పనిచేస్తున్నట్లు తెలిసిందని అన్నాడు. బెంగాల్‌తో పోల్చుకుంటే ముంబైలో ఎక్కువ వేతనం వస్తుందని ముంబైకి వెళ్లాడని తెలిపాడు. పోలీసులు వెల్లడించిన సీసీ ఫుటేజ్‌లో ఉన్నది తన కుమారుడు కాదని అన్నాడు.
సీసీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తి జట్టు పెద్దగా ఉందని, తన కొడుకు జట్టును అంత పెద్దగా ఎప్పుడూ పెంచడని రాహుల్ అమీన్ చెప్పాడు. పరిస్థితిని బట్టి చూస్తుంటే తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించినట్లు తెలుస్తోందని అన్నాడు. కాగా ఈ నెల 16న సెహజాద్ దొంగతనం కోసం సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి.. అడ్డుకున్న అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సెహజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Saif Ali Khan case | సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. నిందితుడి పోలీస్ కస్టడీ పొడిగింపు
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?