Atishi : ఢిల్లీ (Delhi) లో ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి 10 రోజులు అవుతున్నా బీజేపీ అక్కడ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయాన్ని కూడా ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. దీనిపై ఆప్ (AAP) తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీ బీజేపీలో ఎవరికీ ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోవడం వల్లనే ప్రభుత్వ ఏర్పాటులో తాత్సారం జరుగుతున్నదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఎద్దేవా చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది. వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ ఈ ఎన్నికల్లో కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. అయితే బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదిలావుంటే ఈ నెల 19 లేదా 20న ఢిల్లీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Cake blast | రీల్స్ కోసం రిస్క్.. బర్త్డే పార్టీలో పేలిన కేక్.. Viral video
Mahakumbh | మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. నెల రోజులలో ఏడోసారి
Devendra Fadnavis | తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. Video
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు