ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో రాజధాని ముంబైలో మరోమారు టీకా కేంద్రాలు మూతపడ్డాయి. నిల్వలు అడుగంటడంతో నగరంలోని 54 కేంద్రాల్లో శుక్రవారం వ్యాక్సిన్ పంపణీ ఉండదని బృహిన్ మంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. ఈమేరకు మూసి ఉండే కేంద్రాల జాబితాను తన ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో జస్లోక్ హాస్పిటల్, సైఫీ హాస్పిటల్, హిందుజా దవాఖాన, ఏషియన్ హాస్పిటల్ ఉన్నాయి.
ముంబైలో మొత్తం 132 వ్యాక్సిన్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 42 మున్సిపాలటీ నిర్వహిస్తున్న దవాఖానలు ఉండగా, 17 ప్రభుత్వ దవాఖానలు, 73 ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. గతంలో వ్యాక్సిన్ లేమితో టీకా కేంద్రాలు మూతపడ్డాయి. ఇలా ఈనెల 22న 48 వ్యాక్సిన్ కేంద్రాలు, అదేవిధంగా ఏప్రిల్ 10 నుంచి 12 వరకు టీకా కేంద్రాలు మూసి ఉన్నాయి.
#MyBMCUpdates
— माझी Mumbai, आपली BMC (@mybmc) April 22, 2021
Here is the list of vaccination centres that will be fully/partly functional or non-functional owing to limited supply of vaccine.#JabToBeatCorona pic.twitter.com/RwjNLT8GLe
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..