బార్ కి ఎగబడతున్న కస్టమర్లు.. అదే స్పెషల్ ఎట్రాక్షన్
మీకు రుచికరమైన కాక్ టెయిలే కావాలా. మీ మూడ్ కి తగ్గట్టు వినోదం కోరుకుంటున్నారా ? అయితే ఛలో సింగపూర్. కోవిడ్ వల్ల ఇప్పుడు రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో రోబోలనే ఎక్కువగా వాడుతున్నారు. అలా ఓ బార్ యజమాని తన బార్ లో పనిచేసేందుకు ఓ రోబోని ఏర్పాటుచేశాడు. దీనికి బార్ని అని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నాడు.
కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించే వరకు అన్ని పనులూ చకచకా చేస్తుంది. బార్ని మామూలు బార్ టెండర్ కాదు. ఇది 16 రకాల స్పిరిట్లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్ టైల్స్ తయారు చేయగలదు. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ చేస్తుంది. బీర్, ప్రొసెక్కొ లను కూడా బార్నీ కస్టమర్లకు అందిస్తుంది.
బార్ కు వచ్చేవారి మూడ్ కు తగ్గట్టు జోకులు వేస్తూ వారిని నవ్విస్తుంది. కరోనా టైమ్ కాబట్టి బార్ని ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుంటుంది. అలా జాగ్రత్తలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోన్న ఈ రోబోతో బార్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీని కారణంగా బార్ కు `ది బార్ని బార్` అనే పేరు వచ్చింది.
ఎఫ్&పి రోబోటిక్స్ అనే సంస్థ దీన్ని అబివృద్ధి చేసింది. ఈ రోబోలను, వాటి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ను తయారుచేస్తున్న జ్యూరిచ్ కంపెనీ ఇప్పటికే చైనా, ఒమన్ దేశాలకు రోబోలను అమ్మింది. అక్కడ షాపింగ్మాల్స్లో ఇవి కస్టమర్లకు వివిధ రకాల సేవలందిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?



