నేటితో ముగియనున్న సీజేఐ జస్టిస్ బోబ్డే పదవీకాలం
జస్టిస్ బోబ్డే | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. రేపు సాయంత్రం వర్చువల్గా జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ర్టపతి భవన్లో 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ చేత రాష్ర్టపతి రామ్నాథ్ కొవింద్ ప్రమాణం చేయించనున్నారు. ఈ క్రమంలో నేడు జస్టిస్ బోబ్డేతో జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనంలో కూర్చోనున్నారు.
కొవిడ్ దృష్ట్యా కొద్దిమంది అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొననున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

