ఈ కోవిడ్ టైమ్ లో తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్

ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంట్లోనిత్యం మనం వాడే పదార్థాలతోనే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. అలాగే ఎండాకాలం కూడా కాబట్టి ఎలాంటిపానీయాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
గొంతు నొప్పి, దగ్గుకి తేనె నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఓ గిన్నెలో 4 కప్పుల నీళ్లు తీసుకొని, దానిలో తురిమిన అల్లం, చిన్న దాల్చిన చెక్క, తరిగిన మూడు వెల్లుల్లి, లవంగాలు, ఒక టీస్పూన్ పుదీనా రసం, నిమ్మరసాన్ని కలిపి కాసేపు వేడిచేయాలి. చల్లబడిన తర్వాత.. దానిలో తేనె కలిపి తాగాలి. ఇలా వారానికి రెండు స్లారు చేస్తే మంచిది.
పసుపులో కర్కుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులోని బలమైన వ్యాధి నిరోధక లక్షణాలు మంట, నొప్పి తట్టుకునేలా మన శరీరాన్ని తయారు చేస్తాయి. ముందుగా పసుపు నీటిలో కలిపి 15- నుండి 20 నిమిషాల పాటు వేడిచేయాలి. రుచి కోసం దానిలో నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచే వాటిలో మసాలా టీ ఒకటి. దీని తయారీ కోసం ముందుగా తురిమిన అల్లం, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు, ఏలకులు, తులసి ఆకులను అర కప్పు నీటిలో వేసి 30 నిమిషాలు ఉడకబెట్టండి. కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసి తీసుకోండి. మసాలా టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ వేసవిలో తాగాల్సిన పానీయంలో గ్రీన్ స్మూతీ ఒకటి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఫలితంగా కడుపులో మంట తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తినిస్తాయి. ముందుగా కొంచెం బచ్చలికూర, మామిడి లేదా పైనాపిల్, నిమ్మరసం, తాజాగా తరిగిన అల్లం, బాదం పాలు లేదా పెరుగు తీసుకొని మిక్సర్ లో కలపండి. ఆ మిశ్రమాన్ని తాగండి.
రోగనిరోధక శక్తిని పెంచేవాటిలో కధాస్ పానీయం ఒకటి. ఇది జలుబు, దగ్గుతో బాధపడేవారికి మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాక, శ్వాసకోశ వ్యాధులకు కూడా చికిత్స చేస్తుంది. తులసి, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, క్యారమ్ విత్తనాలు, పసుపు, నల్ల మిరియాలను ఒక గిన్నెలో వేసి వేడి చేయండి. రుచి కోసం ఆ మిశ్రమంలో తేనె లేదా బెల్లం కలిపి తీసుకోండి.
పైన చెప్పిన వివరాలన్నీ కూడా మీ వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Immunity drinks
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

