Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Fire accident | దీపావళి పండుగ (Diwali festival) పూట ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలోని ఆరుగురు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Fire accident : దీపావళి పండుగ (Diwali festival) పూట ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలోని ఆరుగురు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బయటికి వచ్చేందుకు మా ర్గం లేకపోవడంతో ఆరుగురూ సజీవదహనమయ్యారు. మహారాష్ట్ర (Maharastra) లోని ధారాశివ్ జిల్లా (Dharashiv district) యద్షి గ్రామం (Yadshi Village) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. యద్షి గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఉత్తమ్ ట్రింబాక్ ఇంట్లోనే కిరాణం దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో దీపావళి రాత్రి భోజనం తర్వాత ఎప్పటిలాగే కుటుంబసభ్యులందరూ ఇంటిపైన పడుకున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా కిరాణం దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇంటికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు దారిలేకుండా మంటలు ఎగిసిపడ్డాయి.
దాంతో ఉత్తమ్ ట్రింబాక్, అతని భార్య చంద్రకళ (70), కుమారుడు గోవింద్ (47), కుమార్తె జ్యోతి (42), మనుమరాండ్లు గాయత్రి (16), సిద్ధి (15) మంటల్లో సజీవదహనమయ్యారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా కిరాణం స్టోర్‌లోని ఏదైనా మండే స్వభావంగల పదార్థంవల్ల జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

