Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Man Kills Nephew To Sell Organs | మనిషి అవయవాలు అమ్మి త్వరగా డబ్బు సంపాదించాలని ఒక వ్యక్తి భావించాడు. నాలుగేళ్ల బాలుడిని అతడు హత్య చేశాడు. శరీరం నుంచి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లను తొలగించాడు. ఈ అవయవాలను ఆన్లైన్లో విక్రయించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.
రాయ్‌పూర్: మనిషి అవయవాలు అమ్మి త్వరగా డబ్బు సంపాదించాలని ఒక వ్యక్తి భావించాడు. నాలుగేళ్ల బాలుడిని అతడు హత్య చేశాడు. శరీరం నుంచి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లను తొలగించాడు. ఈ అవయవాలను ఆన్లైన్లో విక్రయించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. (Man Kills Nephew) ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 36 ఏళ్ల రామ్‌జీత్ రామ్, ఏడాది కిందట ఉపాధి కోసం సన్నా గ్రామానికి వచ్చాడు. నది నకట్ట సమీపంలోని ఒక గుడిసెలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. బంధువైన వాసుదేవ్ తరచుగా వారి ఇంటిని సందర్శించేవాడు.
కాగా, రామ్‌జీత్ నాలుగేళ్ల కుమారుడు నవంబర్ 5 నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు వెతుకగా రెండు రోజుల తర్వాత మహువా గ్రామంలోని ఒక పొలం వద్ద గుంతలో పడేసిన సంచిలో కుక్కి ఉన్న బాలుడి మృతదేహం కనిపించింది. ఈ సమాచారం తెలుసుకున్న సన్నా పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు వంటి అవయవాలు మాయమైనట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు బాలుడి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సమీపంలోని చల్ని గొర్రాపథ్ గ్రామానికి చెందిన బంధువైన వాసుదేవ్‌పై అనుమానించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. రోజువారీ కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మరింత డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించారు.
అయితే త్వరగా డబ్బు సంపాదించే మార్గాల కోసం నిందితుడు వాసుదేవ్ తరచుగా సోషల్ మీడియాలో వెతికేవాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ క్రమంలోనే చిన్న పిల్లల అవయవాలను తొలగించి విక్రయించాలనే ఆలోచన అతడికి కలిగిందని చెప్పారు. నవంబర్ 5న నిందితుడు బాలుడిని నమ్మించి తనతో పాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడని పోలీస్ అధికారి తెలిపారు. మద్యం, చికెన్ కొనుగోలు చేసిన అతడు బాలుడికి మద్యం తాగించినట్లు చెప్పారు.
ఆ బాలుడు మత్తులోకి జారుకుని నిద్రపోయిన తర్వాత, నిందితుడు కత్తితో గొంతు కోసి హత్య చేశాడని, ఆపై బాలుడి శరీరాన్ని కోసి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లను తొలగించి వాటిని ఒక ప్లాస్టిక్ బకెట్లో భద్రపరిచినట్లు పోలీస్ అధికారి వివరించారు. బాలుడి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సంచిలో కుక్కి పొలంలోని నీటి గుంతలో పడేసి దానిపై మట్టి కప్పాడని వెల్లడించారు.
నిందితుడు వాసుదేవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, అవయవాలు ఉన్న ప్లాస్టిక్ బకెట్, ఇతర వస్తువులను ఒక గుంత నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chhattisgarh
- Earn
- Kills
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

