Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. ఆగస్టు 13వ తేదీన పార్లమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. కానీ 88 రోజులు అవుతున్నా.. సమావేశాలను ఇంకా అధికారికంగా ముగించలేదు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. ఉభయసభలు 88 రోజులుగా వాయిదా పడ్డాయి. ఆగస్టు 13వ తేదీన పార్లమెంట్‌ను వాయిదా వేశారు. కానీ ఆ సమావేశాలను ముగించినట్లు ప్రకటించలేదు. దీంతో 2008లో నమోదు అయిన 87 రోజుల రికార్డును ఇప్పుడు పార్లమెంట్ బ్రేక్ చేసింది. పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయకుండా కొంతకాలం వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు. సోమవారం నాటికి లోక్‌సభ కానీ, రాజ్యసభ కానీ ఇంకా అధికారికంగా ప్రోరోగ్ కాలేదు. దీని ద్వారా వర్షాకాల సమావేశాలను స్వల్ప వ్యవధి కోసం మళ్లీ నిర్వహిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షార్ట్ నోటీసు ఇచ్చి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని భావిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్‌సభ సీట్ల పునర్ విభజన బిల్లులను ఆమోదింపచేసేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపాదిత బిల్లు ద్వార లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కి పెంచనున్నారు. ప్రస్తుత సెషన్లోనే సమావేశాలను పొడిగించాలంటే కనీసం రెండు రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే కొత్త సెషన్ కోసం అయితే కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి సభలు నిరవధిక వాయిదా పడితే, ఆ సమావేశాలను రద్దు చేసేందుకు రాజ్యాంగం ప్రకారం ఎటువంటి నిర్దేశిత సమయ నియమం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

