MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer reddy | నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణ రాష్ట్ష్ట్రాన్ని ఎండిపెట్టినవ్. రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయాన్ని కానీ, తాగునీరు కానీ అందరికీ అందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
MLA Sudheer Reddy | కేసీఆర్‌పై కక్ష సాధింపు కోసం నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణకు కరువు తెచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మొన్న సందర్శించినప్పుడు మేడిగడ్డ దగ్గర దాదాపు 21 వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది.. దాదాపు 2 టీఎంసీల నీళ్లు పోతున్నయి.. ఎత్తిపోసుకునే అవకాశముంది.. మేడిగడ్డ బ్యారేజ్‌కు కన్నెపల్లికి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంది.. కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు.. మేడిగడ్డ దగ్గర క్రాక్ అయింది.. కానీ అన్నారం, సుందిళ్ల బాగున్నాయని గతంలో ఎన్డీఎస్ఏ కూడా మాకు సర్టిఫికెట్ ఇచ్చింది.. అలాగే సీడబ్ల్యూపీఆర్ఎస్ అనే సంస్థ కూడా వాళ్లకు క్లీన్ చీట్ ఇచ్చిందన్నారు.
ఆ 2 బ్యారేజ్‌లకు అన్నారం, సుందిళ్లకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.. మీరు ఎత్తిపోసుకోవచ్చని కూడా స్పష్టం చెప్పడం జరిగింది.. ఎన్డీఎస్ఏ కూడా కోర్టుకు ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారో స్పష్టంగా ఏం చెప్పారంటే మేం టెక్నికల్‌గా రిపోర్ట్ ఇవ్వగలుగుతం. నింపి ఎత్తిపోసుకునేది మీ ఇష్టం అని చెప్పిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.
మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయి.. ఈ సంవత్సరం ఆగస్టు 1న 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇదే మేడిగడ్డ నుంచి ప్రవాహం చేసి కిందికి పోయి సముద్రగర్భంలో కలిసినయి. పోయిన సంవత్సరం కూడా ఇంచుమించు 10-11 లక్షల క్యూసెక్కులు అదే మేడిగడ్డ 2025., 2026లో బ్యారేజ్ నుంచి పోయాయి.
మరి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు తట్టుకునే కెపాసిటీ మేడిగడ్డ దగ్గరున్నపుడు.. కేవలం ఎన్టీఎస్ఏ చెప్పింది..అక్కడ క్రాక్ వచ్చిందని కారణంగా చూపెట్టి నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణ రాష్ట్ష్ట్రాన్ని ఎండిపెట్టినవ్. రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయాన్ని కానీ, తాగునీరు కానీ అందరికీ అందకుండా చేసిన దుర్మార్గుడివి నీవని ఫైర్ అయ్యారు.
కేసీఆర్‌పై కక్ష సాధింపు కోసం నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణకు కరువు తెచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి
ఆగస్టు 1వ తేదీన 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర సంస్థలు చెప్పినా నీళ్లు ఎత్తిపోయలేదు
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

