Thalapathy Vijay : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు భారీ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత.. చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధమే కారణమని విడాకుల పిటిషన్లో సంగీత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన కోర్టు ఏప్రిల్ 20న కోర్టుకు రావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
నటుడు విజయ్, సంగీత వివాహం 1999లో జరిగింది. విజయ్ ఒక సినీ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ, ఈ కారణంగానే అతడి నుంచి విడాకులు కోరుతున్నట్లు సంగీత తన పిటిషన్లో వివరించారు. రెండేళ్లక్రితం విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై ఇటీవల బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ మాట్లాడుతూ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలన్నారు. అయితే, తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ విమర్శించాడు. ఈ అంశంపై త్రిష కూడా స్పందించింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించింది. దీంతో నాగేంద్రన్ తర్వాత క్షమాపణ చెప్పాడు.
దీంతో నెమ్మదిగా ఈ అంశం కనుమరుగైనట్లు అనిపించినా.. తాజాగా విజయ్ భార్య విడాకుల పిటిషన్‌తో ఈ ఎపిసోడ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. నిజానికి విజయ్- త్రిష మధ్య బంధం గురించి చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఇటీవల నాగేంద్రన్ వ్యాఖ్యలు, విడాకుల పిటిషన్ అంశం వీటికి బలం చేకూరుస్తోంది. అయితే, త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ అంశం అతడి రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.