INDW vs AUSW : ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు భారీ షాక్. పొట్టి సిరీస్‌ను పట్టేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. తొలి వన్డేలో కంగుతిన్న అమ్మాయిలు.. నిర్ణయాత్మక మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డలేకపోయారు. ఓపెనర్ ప్రతీకా రావల్(52), హర్మన్‌ప్రీత్ కౌర్(54)లు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా.. 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా ఛేధించింది. జార్జియా వోల్(101) సెంచరీతో, ఫొబే లిచ్‌ఫీల్డ్(80) హాప్ సెంచరీతో విజృంభించగా.. మరో మ్యాచ్ ఉండగానే ఆతిథ్య జట్టు సిరీస్‌ను గెలుపొందింది.
విశ్వవిజేతగా తొలి విదేశీ పర్యటనలోనే భారత జట్టు వన్డే సిరీస్ చేజార్చుకుంది. నిరుడు వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఈసారి మాత్రం తలొగ్గింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమితో సిరీస్‌ను కోల్పోయింది.
“Don’t do anything silly” ➡️ *ramp*
Georgia Voll had some heart in mouth moments as she brought up her second ODI century. #AUSvIND pic.twitter.com/ctMjBUPa1z
— cricket.com.au (@cricketcomau) February 27, 2026
Australia win by 5 wickets in Hobart.
They take an unassailable lead of 2-0 in the #AUSvIND ODI series.
Scorecard▶️ https://t.co/2h7AVOuGrA#TeamIndia pic.twitter.com/xcv1HiaGCz
— BCCI Women (@BCCIWomen) February 27, 2026
నిర్ణయాత్మక రెండో వన్డేలో 251 రన్స్‌కే పరిమితమైన హర్మన్‌ప్రీత్ సేన ప్రత్యర్ధిని కట్టడి చేయలేకపోయింది. ఆరంభంలోనే అలీసా హీలీ(6)ని కష్వీ గౌతమ్(2-47) బౌల్డ్ చేసి బ్రేకిచ్చినా.. ఫొబే లిచ్‌ఫీల్డ్(80), జార్జియా వోల్(101)లు క్రీజునంటుకొని భారత బౌలర్లను విసిగించారు. దూకుడుగా ఆడిన వీరిద్దరూ అర్ధ శతకాలతో లక్ష్యాన్ని కరిగించారు. లిచ్‌ఫీల్డ్ ఔటైనా.. జోరు తగ్గించని వోల్ సెంచరీతో విరుచుకుపడింది. కష్వీ గౌతమ్ ఓవర్లో వోల్ వెనుదిరిగినా.. బేత్ మూనీ(31).. అష్లీ గార్డ్నర్(19 నాటౌట్)లు లాంఛనం పూర్తి చేశారు. నామమాత్రమైన మూడో వన్డే మార్చి1 న హోబర్ట్‌లో జరుగనుంది.
సిరీస్ సమం చేయాల్సిన మ్యాచ్‌లో శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయింది భారత్. ఓపెనర్లు స్మృతి మంధాన(31), ప్రతీకా రావల్(52)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. ధాటిగా ఆడుతున్న మంధానను అష్లీ గార్డ్నర్ బౌల్డ్ చేయడంతో.. 78 వద్ద తొలి వికెట్ పడింది. జెమీమా రోడ్రిగ్స్(11) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగడంతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(54) సమయోచితంగా ఆడింది.
Innings Break!
Vital half-centuries from Pratika Rawal and skipper Harmanpreet Kaur take #TeamIndia to 2️⃣5️⃣1️⃣
Over to the bowlers now 👊
Scorecard ▶️ https://t.co/2h7AVOuGrA#AUSvIND pic.twitter.com/RVkZyU1p8S
— BCCI Women (@BCCIWomen) February 27, 2026
98కే రెండు వికెట్లు పడిన వేళ.. ప్రతీకతో, అమన్‌జోత్ కౌర్(13), రీచా ఘోష్(22), కష్వీ గౌతమ్(25)లతో తను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. మేగన్ షట్ ఓవర్లో హర్మన్‌ప్రీత్ వెనుదిరగడంతో ధాటిగా ఆడేవాళ్లు కరువయ్యారు. ఆఖర్లో క్రాంతి గౌడ్(19), వైష్ణవీ శర్మ(10 నాటౌట్)లు బ్యాట్ ఝులిపించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 251కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో గార్డ్నర్, అలనా కింగ్ రెండేసి వికెట్లతో రాణించారు.