అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్ర, శని వారాల్లో కొత్తగా రోజుకు 62 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. దేశవ్యాప్తంగా ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
తాజాగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎంలో) విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిపి మొత్తం 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ మెహుల్ ఆచార్య ఈ విషయాన్ని వెల్లడించారు.
Gujarat | 40 people including students and professors at the Indian Institute of Management, Ahmedabad have tested positive for COVID19: Mehul Acharya, Deputy Health Officer, Ahmedabad Municipal Corporation pic.twitter.com/TuySbNGm7n
— ANI (@ANI) March 28, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
దేశంలోని సామాజిక కార్యకర్తల కృషి ఎనలేనిది: ప్రధాని మోదీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు