e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home క్రైమ్‌ నిజాంపేట్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు

నిజాంపేట్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు

హైదరాబాద్‌: నగర శివార్లలోని నిజాంపేట్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల సమయంలో ఏఎస్‌ఐ, హోంగార్డును రెండు కార్లు ఢీకొట్టాయి. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి నిజాంపేట్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. దీనిని గమనించిన సృజన్‌ అనే వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సృజన్‌ కారు ఢీకొని హోంగార్డుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తుండగా మరో కారు వచ్చి ఏఎస్‌ఐని ఢీకొట్టింది. దీంతో మహిపాల్‌ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఏఎస్‌ఐ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రమాదాలకు కారణమైన సృజన్‌, అస్లాంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

‘లవ్ స్టోరీ’లో సున్నిత‌మైన పాయింట్‌..!

మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!

ఎయిర్‌ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి: హర్దీప్ సింగ్

ఏప్రిల్ 1 నుంచి అమ‌ర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేష‌న్ షురూ!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement