రవితేజ సినిమాలో కీలకంగా..
ఓ అరడజను హిందీ సినిమాల్లో ప్రస్తుతం భాగమై ఉన్నది ముంబయ్ సోయగం తమన్నా భాటియా. వీటిలో కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలు కొన్నుంటే, ప్రత్యేక గీతాల్లో నర్తిస్తున్న సినిమాలు కొన్నున్నాయి.
ఓ అరడజను హిందీ సినిమాల్లో ప్రస్తుతం భాగమై ఉన్నది ముంబయ్ సోయగం తమన్నా భాటియా. వీటిలో కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలు కొన్నుంటే, ప్రత్యేక గీతాల్లో నర్తిస్తున్న సినిమాలు కొన్నున్నాయి. ‘పురుషన్’ అనే ఓ తమిళ సినిమాలో కూడా ఈ అందాలభామ నటిస్తున్నది. తెలుగులో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా విడుదల కావాల్సివుంది. ఇదిలావుంటే.. తాజాగా టాలీవుడ్లో తెరకెక్కుతున్న ఓ ప్రస్టేజియస్ సినిమాలో కీ రోల్ పోషించేందుకు తమన్నా ఇటీవలే సైన్ చేసిందట.
ఆ సినిమా మరేదోకాదు, రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’. ఇప్పటివరకూ వచ్చిన రవితేజ సినిమాలకు భిన్నంగా, భావోద్వేగాలతో కూడిన ఓ వినూత్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, కథలోని కీలకమైన ఓ పాత్రకు తమన్నాను దర్శకుడు శివ నిర్వాణ ఎంపిక చేశారట. త్వరలోనే తమన్నా ఈ సినిమా సెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

