శుక్రవారం 10 జూలై 2020
National - Jun 28, 2020 , 10:58:33

కొత్త‌గా 33 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు పాజిటివ్

కొత్త‌గా 33 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు పాజిటివ్

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్ అందరిని క‌ల‌వ‌ర పెడుతోంది. దేశ ప్ర‌జ‌లంద‌రిని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది క‌రోనా వైర‌స్. గ‌డిచిన 24 గంట‌ల్లో 33 మంది బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో బీఎస్ఎఫ్ లో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య 944కు చేరింది. ఇందులో 637 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు జ‌వాన్లు క‌రోనాతో చ‌నిపోయారు. 

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 5,29,421 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 16,103 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.


logo