నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ

న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజుల పాటు సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు వేయడమే లక్ష్యంగా టీకా ఉత్సవ్ ప్రారంభించారు. టీకా పండుగ ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టడానికి వ్యాక్సినేట్, ట్రీట్, సేవ్, చెక్ అనే నాలుగు సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. 45 ఏళ్లకు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్తు వేస్తున్న విషయం తెలిసిందే. అర్హులందరూ కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వ్యాక్సిన్లు వేయించుకోవచ్చు.
ఆదివారం (ఏప్రిల్ 11)న జ్యోతిబా పూలే జయంతి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. దీంతో ఈ నాలుగు రోజులను టీకా ఉత్సవ్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఎంచుకున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కూడా మోదీ పిలుపునిచ్చారు.
అటు పెద్ద రాష్ట్రాలు, జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్, బీహార్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ టీకా ఉత్సవ్ సందర్భంగా వేగవంతం చేయడమే లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలను అభ్యర్థించారు. పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పది కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.
आज से हम सभी, देशभर में टीका उत्सव की शुरुआत कर रहे हैं। कोरोना के खिलाफ लड़ाई के इस चरण में देशवासियों से मेरे चार आग्रह हैं… https://t.co/8zXZ0bqYgl
— Narendra Modi (@narendramodi) April 11, 2021
ఇవి కూడా చదవండి..
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

